సాహసం నా పథం రాజసం
నా రధం సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావటం కష్టమా
లొకమే బానిసై చేయదా ఊడిగం
శాశనం దాటటం శక్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటనా
ఈ పిడికిలిలో తానొదుగునుగా
(సాహసం)
నిశ్చయం నిశ్చలం..హా హా
నిర్భయం నాహయం..హా
కానిదేముంది నే కొరుకుంటే
పూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా
తప్పని ఒప్పని తర్కమే చేయను
కష్టమో నష్టమో లెక్కలే వేయను
ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహవెంటా
నే మనసు పడితే ఏ కలలనైనా
ఈ చిటిక కొడుతు నే పిలువనా
(సాహసం)
అదరనీ బెదరని ప్రవ్రుత్తి
ఒదగని మదగజమే మహర్షి
వేడితే లేడి ఒడి చేరితుందా
వేట సాగాలి కాదా...హా..హా
ఓడితే జాలి చూపేన కాలం కాల రాసేసి పోదా
అంతమో సొంతమో పంతమే వీడను
మందలొ పందలా ఉండనే ఉండను
ధీరువల్లే పారిపోను రేయి వొళ్ళొ దూరిపొను
నే మొదలు పెడితే ఏ సమరమైనా
నాకెదురుపడునా ఏ అపజయం
(సాహసం)
తకిటజం తరితజం తనతజం జంతజాం
తకిటజం తరితజం జంతజాం...
https://www.youtube.com/watch?v=bM7jlCA_Dtg
https://www.youtube.com/watch?v=l_YhOBDByz4