చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక

తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

మంగళ సూత్రం అంగడి సరుకా

కొనగలవా చెయ్ జారాక

లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక

(చిలకా ఏ తోడు)

బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే

బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే

వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే

అమృతమే చెల్లించి ఆ విలువతో

హలాహలం కొన్నావే అతి తెలివితో

కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే

(చిలకా ఏ తోడు)

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో

మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో

ఆనందం కొనలేని ధన రాశితో

అనాధగా మిగిలావే అమవాసలో

తీరా నువు కను తెరిచాక తీరం కనబడదే ఇంక

(చిలకా ఏ తోడు)

https://www.youtube.com/watch?v=LtS5c3vSAPY