ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా
కనపడేవెన్నెన్ని కెరటాలు
కలగలిపి సముద్రమంటారు
అడగరేం ఒక్కొక్క అల పేరు....
మనకిలా ఎదురైన ప్రతివారు
మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషీ అంటే ఎవరూ....
సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టు అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు, నీ చూపుల్లో లేదా...
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా
మనసులో నీవైన భావాలే
బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు.. నిజాల సాక్ష్యాలే.....
శత్రువులు నీలోని లోపాలే
స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే....
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం
పుట్టుక చావు.... రెండే రెండూ, నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానియ్యి
https://www.youtube.com/watch?v=8uKIH7AnVfg