ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం

నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పెందుకు అది తొలి పాఠం

మునివేళ్ళతో మెఘాలనే మీటెంతగా ఎదిగాం మనం

పసివాళ్ళగా ఈ మట్టిలొ ఎన్నాళిలా పడిఉంటాం

కునికే మన కను రెపల్లొ వెలిగిద్దాం రంగుల స్వప్నం

ఇదిగొ నీ దారి ఇటు ఉందని సూరిడిని రా రమ్మందాం

(జాగో జాగొరే)

ఆకాశం నుండి సూటిగా..దూకేస్తే ఉన్నపాటుగా

ఎమౌతానంటూ చినుకు అలా ఆగిందా బెదురుగా

కనుకే ఆ చినుకు ఏరుగా..ఏరే వరద హోరుగా

ఇంతింతై ఎదిగి ఎదిగి అంతగా తరగని సంద్రమైందిగా

సందేహిస్తుంటే అతిగా..సంకల్పం నెరవేరదుగా

ఆలోచన కన్న త్వరగా..అడుగేద్దాం ఆరంభంగా

(జాగో జాగొరే)

ఎ పని మరి ఆసాద్యమే కాదే

ఆ నిజం మహా రహస్యమా

వేసే పదం పదం పదే పదే పడదొసే

సవాలనే ఎదురుకొమా

మొదలెట్టక ముందే ముగిసే కధ కాదే మన ఈ పయనం

సమరానికి సై అనగలిగే సంసిద్దత పేరే విజయం

(జాగో జాగొరే)